సెమీ ఫైనల్ పోరులో భారత్-పాక్‌ హోరాహోరీ సమరం


హైదరాబాద్: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. క్రికెట్ మ్యాచ్‌లో కాదు.. ఫుట్‌బాల్‌లో. ఢాకా వేదికగా జరుగుతోన్న ఎస్ఏఎఫ్ఎఫ్ కప్ టోర్నీలో అటు పాకిస్తాన్.. ఇటు భారత్ రెండు జట్లు సెమీ ఫైనల్స్ వరకూ చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు గట్టి ప్రత్యర్థితో పోటీపడనుంది. ఇక భారత్ విషయానికొస్తే జట్టులోని ఆటగాళ్లంతా ఒక్క సుమీత్ పస్సీని మినహాయించి మిగిలినవారంతా అండర్ 23 ఆటగాళ్లే.

టోర్నీలో ఇంతకుముందు జరిగిన వాటిలో భారత జట్టు శ్రీలంక.. మాల్దీవులను ఓడించి 2-0తో కొనసాగుతోంది. ఓ దశాబ్ద కాలం తర్వాత టీమిండియా పొరుగుదేశంతో తలపడుతోంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే నేపాల్, భూటాన్‌లను చిత్తు చేసిన పాక్.. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఈ సెమీ ఫైనల్స్‌కు సిద్ధమైంది.

పాకిస్తాన్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న బ్రెజిల్స్ ఆంటోనియో నౌగురా ఆసియా గేమ్స్‌లో తమ జట్టు నాలుగు దశాబ్దాల అనంతరం మొదటి విజయాన్ని నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాడు. ఇంతకుముందు కోచ్‌గా వ్యవహరించిన కలీముల్లా ఫిట్‌నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమైయ్యాడు.

2005 తర్వాత పాకిస్తాన్ జట్టు తొలి సారి సెమీ ఫైనల్ వరకూ చేరింది. దానికంటే ముందు 1997లో మంచి లీడింగ్‌తో రాణించిన పాకిస్తాన్ మరోసారి సెమీఫైనల్‌కు సిద్ధమైంది. ఈ విషయంపై పాక్ క్రీడాకారుడు మాట్లాడుతూ.. 'మేము ఈ మ్యాచ్ గురించి ఆందోళన చెందడం లేదు. ఇది కూడా మామూలు మ్యాచ్ లాంటిదే. ఈ మ్యాచ్ గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఫైనల్ చేరేందుకు వారిని కచ్చితంగా ఓడించి తీరతాం' అని పేర్కొన్నాడు.

Read More About: saff cup football pakistan india

Have a great day!
Read more...

English Summary

India takes on arch-rivals Pakistan in Dhaka in the ongoing Saff Cup semi-finals. It will be a thrilling encounter as Pakistan is making a comeback to international football after a hiatus for three years.