ఆస్ట్రేలియా సిరీస్‌కు సమయం ఆసన్నమైంది


హైదరాబాద్: ట్వీట్లలో వైవిధ్యాన్ని కనబరుస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ కనిపించే వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు మరో విషయంతో నెటిజన్లకు పని పెంచాడు. నాలుగో టెస్టుకు ముందే ఓటమి ఖరారైన ఇండియా జట్టు చివరి వరకూ పోరాడింది. ఈ పోరాటంలో టీమిండియాకు రాహుల్, పంత్‌లు ఎంతో సహకారం అందించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు.

వీరి అత్యుత్తమ ప్రదర్శనకు వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకోలుగా ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు 4-1తేడాతో ఇంగ్లాండ్‌ ముందు ఓడినా గెలిచేందుకు చేసిన కృషికి సంతృప్తి వ్యక్తం చేశాడు. 'కోహ్లీ.. బౌలర్లు మినహాయించి మిగిలిన వారు కూడా సిరీస్ ఆరంభం నుంచి శ్రద్ధ కనబరిచినట్లు అయితే బాగుండేది. ఈ సారి పర్యటనకు వెళ్లే ముందుగానే ఇంకొంత ఎక్కువగా శ్రమించాలి. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవ్వండి'

భారత్ 2018 నవంబరులో ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఈ పర్యటనలో మూడు 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే చాలా రోజుల తర్వాత మళ్లీ భారత్ విదేశీ జట్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ 2 టెస్టులు, 5 వన్డేలు, 3 టీ20ల్లో ఆడేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ 2018 అక్టోబరు 4 నుంచి మొదలుకానుంది. అయితే ఈ సిరీస్ ఆసియా కప్ పూర్తి అయిన వారంలోపే ఆరంభం అవుతోంది.

భారత్-వెస్టిండీస్‌ల మధ్య అక్టోబరు 4 న తొలి టెస్టు మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. రెండో టెస్టు అక్టోబరు 12న హైదరాబాద్‌లో.. ఐదు వన్డే మ్యాచ్‌లను అక్టోబర్ 21 నుంచి నవంబరు 1వరకూ జరగనున్నాయి. ఇక 3 టీ20లు నవంబరు 4,6,11 తేదీల్లో జరుగుతాయి.

Have a great day!
Read more...

English Summary

Virender Sehwag took to Twitter and posted a motivational message for Indian cricket team following their 1-4 Test series loss against England.