రికార్డులు బద్దలు కొట్టిన రాహుల్-పంత్‌ల సెంచరీల భాగస్వామ్యం


హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయింది. సిరీస్ ఓటమి పక్కా అయిపోయినా పోరాటంలో మాత్రం వెనుకంజ వేయలేదు. చివరి టెస్టులో అద్భుతమైన ఆటతీరుతో భారత బ్యాట్స్‌మెన్ పోరాటం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను వణికించారు.

చివరి రోజు ఆటతో ఆదుకున్న రాహుల్, పంత్:

ఓవర్‌నైట్ స్కోరు 58/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్‌ను రాహుల్, పంత్ సెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని కలలుకన్న టీమిండియాకు ఇంగ్లాండ్ బౌలర్ రషీద్ చుక్కలు చూపించాడు. అనూహ్య రీతిలో రాహుల్‌ను రషీద్ పెవిలియన్ చేర్చాడు.

1979లో సునీల్ గవాస్కర్ - చౌహాన్

కాసేపటికే పంత్ కూడా ఔటవడంతో భారత్‌కు ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. రాహుల్, పంత్ అనేక రికార్డులు నెలకొల్పారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 204 రన్స్ జోడించగా.. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే రెండో అతిపెద్ద భాగస్వామ్యం. 1979లో సునీల్ గవాస్కర్ - చౌహాన్ ఓవల్‌లోనే తొలి వికెట్‌కు 213 పరుగులు జోడించారు.

అవకాశాలను అందుకోలేకపోయాం: ఇంగ్లీషు గడ్డపై ఓటమిపై కోహ్లీ

1999లో లాంగర్-గిల్‌క్ట్రిస్ట్ జోడి పాకిస్థాన్‌పై

నాలుగో ఇన్నింగ్స్‌లో ఏ జట్టు తరఫునైనా ఆరో వికెట్‌కు నమోదైన రెండో అత్యధిక భాగస్వామ్యం రాహుల్-పంత్ జోడీది. 1999లో లాంగర్-గిల్‌క్ట్రిస్ట్ జోడి పాకిస్థాన్‌పై ఆరో వికెట్‌కు 238 పరుగులు జోడించింది. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత్ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించడం ఇది నాలుగోసారి. చివరసారిగా రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు 1999లో న్యూజిలాండ్‌పై సెంచరీలు బాదారు.

పోరాడి ఓడిన భారత్..

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్ అండర్సన్‌ (3/45), శామ్ కర్రన్‌ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్‌ 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Have a great day!
Read more...

English Summary

London, two of India's NextGen cricketers, KL Rahul and Rishabh Pant showed why they are considered so special by the fans and the pundits.