భారత్‌ బంద్‌లో పాల్గొన్న ధోని!: ఆ వార్తల్లో నిజమెంత?


హైదరాబాద్: పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా సోమవారం(సెప్టెంబరు 10న) దేశవ్యాప్తంగా విపక్షాల ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బంద్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహంద్ర సింగ్‌ ధోని కూడా పాల్గొన్నట్లు గత రెండు రోజులుగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ధోని భారత్‌ బంద్‌లో పాల్గొనడం నిజమేనా?

దీంతో అభిమానులంతా ధోని భారత్‌ బంద్‌లో పాల్గొనడం నిజమేనా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధోని తన భార్య సాక్షితో పాటు మరికొంత మందితో కలిసి ఓ పెట్రోల్‌ బంకులో కూర్చున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ తర్వాత ధోని భారత్ బంద్‌లో పాల్గొనలేదని తేలింది.

Advertisement
అసలేం జరిగింది?

ధోని, అతడి భార్య సాక్షితోపాటు మరికొందరు భారత్ బంద్‌‌కు మద్దతుగా పెట్రోల్‌ బంక్‌లో కూర్చున్నారని కామెంట్‌ చేస్తూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా, దానిని కాంగ్రెస్‌ అధికార ప్ర తినిధి ప్రియాంక చతుర్వేది రీ ట్వీట్‌ చేశారు. దీంతో అది వైరల్ అయింది. తాజాగా, దీనిపై ధోని సన్నిహితులు వివరణ ఇచ్చారు.

Advertisement
ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనలేదు

"ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనలేదు. గత నెలలో యాడ్ షూటింగ్‌ నిమిత్తం ధోనీ సిమ్లాలో పర్యటించాడు. యాడ్ షూటింగ్ సమయంలో తీసిన ఫొటో ఇది. అంతేకానీ, ధోని ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదుఠ అని వారు తెలిపారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కే ధోని పరిమితమయ్యాడు.

Advertisement
ఆసియా కప్‌లో ఆడనున్న ధోని

దీంతో, క్రికెట్ నుంచి తనకు లభించిన విరామాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ధోని చోటు దక్కించుకున్నాడు. ఇందుకోసం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లతో కలిసి ధోనీ గురువారం దుబాయి బయల్దేరనున్నాడు.

English Summary

The opposition parties has called a Bharat Bandh on Monday to protest against the rising fuel prices. The nationwide strike and protests impacted many states and there were reports of violence from some areas too. However, during the protests, some pictures of MS Dhoni reportedly taking part in the Bandh started appearing on social media.