టెస్టు ర్యాంకులు: కోహ్లీ నంబర్ వన్ స్థానం పదిలం


హైదరాబాద్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లీషు గడ్డపై అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ఈ సిరిస్‌లో 593 పరుగులు చేసిన 930 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

రికార్డులు బద్దలు కొట్టిన రాహుల్-పంత్‌ల సెంచరీల భాగస్వామ్యం

ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (929), కేన్ విలియమ్సన్ (847), జో రూట్ (835), డేవిడ్ వార్నర్ (820) పాయింట్లతో టాప్-5లో కొనసాగుతున్నారు. ఈ సిరిస్ ఆరంభానికి ముందు స్మిత్ కన్నా 27 పాయింట్ల వెనుక ఉన్న విరాట్ కోహ్లీ సిరీస్ ముగిసిన తర్వాత స్మిత్ క‌న్నా ఒక పాయింట్ ముందంజ‌లో ఉన్నాడు.

వీరిద్దరూ కేవలం ఒక్క పాయింట్ మాత్రమే మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవల్ వేదికగా తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 200కుపైగా పరుగులు సాధించడంతో 11 స్థానాలు మెరుగుప‌ర‌చుకొని 709 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్ చేతిలో 1-4తో ఓటమి: టెస్టుల్లో మారని టీమిండియా ర్యాంకు

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో సెంచరీలు సాధించిన ఛటేశ్వర్ పుజారా 772 పాయింట్లతో ఆరో స్థానంలో, లోకేశ్ రాహుల్ 635 పాయింట్లతో 19వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక, బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 899 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

భారత్ తరఫున రవీంద్ర జడేజా 814 పాయింట్లతో నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ 769 పాయింట్లతో 8వ ర్యాంకులో ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ చేతిలో 4-1తో టెస్టు సిరిస్‌ను కోల్పోయిన టీమిండియా ఖాతాలో 10 పాయింట్లు తగ్గినప్పటికీ, నంబర్ వన్ ర్యాంకుకి ఎలాంటి ఢోకా లేదు.

ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు నంబర్ వన్ స్థానంలో టీమిండియాకు పాయింట్ల పరంగా చాలా వ్యత్యాసం ఉండటంతో భారత్‌ ర్యాంకులో ఎలాంటి మార్పు రాలేదు. 10 పాయింట్లు కోల్పోయినా ఇప్పటికీ 115 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 4-1తో సిరీస్‌ దక్కించుకున్న ఇంగ్లాండ్‌ 105 పాయింట్లతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఈ సిరీస్‌ ప్రారంభమయ్యే నాటికి భారత్‌ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్‌ 97 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

Have a great day!
Read more...

English Summary

India continued to be at the number one position as England grabbed the fourth spot in the ICC Test Team Rankings after completing a 4-1 series victory at The Oval on Tuesday. The Virat Kohli-led side had started the series at 125 points but the series loss meant the team is now on 115 points.