మిథాలీ.. జులన్‌ల కెరీర్‌లో అరుదైన మైలు రాళ్లు


హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్లు జులన్ గోస్వామి.. మిథాలీ రాజ్‌లు కెరీర్‌లోనే అరుదైన మైలురాళ్లను దాటేశారు. గాలె ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో జులన్ గోస్వామి 300 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లోనే మిథాలీ రాజ్ కూడా అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించి మరో రికార్డును లిఖించారు.

Advertisement

అభినందనలు తెలియజేసిన బీసీసీఐ:

ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ) వారి అచీవ్‌మెంట్స్‌ను ప్రోత్సహిస్తూ అభినందనలు తెలియజేసింది. 'గాలె వేదికగా శ్రీలంకతో తొలి వన్డే ఆడిన భారత మహిళా జట్టు అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనే 300 వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా జులన్ గోస్వామి రికార్డులకెక్కింది. మిథాలీ రాజ్ 118 మ్యాచ్‌లకు అధిక వన్డేలకు నాయకత్వం వహించి రికార్డు సృష్టించింది.' అంటూ బీసీసీఐ మహిళా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.

Advertisement
301 వికెట్లను దాటేసిన గోస్వామి

ఇటీవలే అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన జులన్ గోస్వామి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 301 వికెట్లు తీసిన రికార్డు సొంతం చేసుకుంది. తన 300వికెట్ శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌ఉమన్ నిపునిహన్సికది కావడం విశేషం. గోస్వామి ఆమె కెరీర్‌లో 40 టెస్టులు, 205 వన్డేలు, 56 టీ20లు ఆడారు.

Advertisement
మిథాలీ ఇంగ్లాండ్ కెప్టెన్‌ను మించింది:

ఐసీసీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం ముగిసిన మ్యాచ్‌తో 118 వన్డేలకి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌ 117 వన్డేలకి నాయకత్వం వహించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా మిథాలీ రాజ్ ఆమెని వెనక్కి నెట్టి నెం.1 స్థానంలో నిలిచింది.

Advertisement
మిథాలీ తొలి సారిగా కెప్టెన్సీ:

లక్నో వేదికగా వెస్టిండీస్‌తో 2003-04లో జరిగిన వన్డే సిరీస్‌తో తొలిసారి భారత మహిళల జట్టుకి నాయకత్వం వహించిన మిథాలీ రాజ్.. ఆ తర్వాత రెండు సార్లు (2005, 2017) భారత జట్టుని ప్రపంచకప్‌ ఫైనల్‌కి చేర్చింది.

English Summary

Indian women cricketers Jhulan Goswami and Mithali Raj achieved milestones during the first One-day International (ODI) against Sri Lanka at the Galle International Stadium.