చెన్నై సూపర్ కింగ్స్ టిక్కెట్ కాదిది వెడ్డింగ్ కార్డ్!!


హైదరాబాద్: అభిమానం హద్దులు దాటింది. అది ఎంతగా అంటే జీవితంలో ఎంతో ముఖ్యంగా భావించే పెళ్లి వేడుకలో కూడా అభిమానం భాగమైంది. తమ అభిమానాన్ని .. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తుంటారు. ఏదో ఒక రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ వీరాభిమాని అయిన కే. వినోద్ అనే వ్యక్తి తన పెళ్లిపత్రికను వెరైటీగా ప్రింట్ చేయించాడు.

అచ్చూ చెన్నై హోమ్ మ్యాచ్ టికెట్ రూపంలో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉండటం చాలా మందిని ఆకర్షిస్తోంది. ధోనీ, చెన్నై జట్టుకు వీరాభిమానిగా ఏదైనా చేయాలని భావించాను. అది ఇప్పటి వరకూ ఎవరి చేయనిదై ఉండాలి అనుకుని ఈ ప్రయత్నం చేశాను. నా పెళ్లిపత్రికను ఇలా వెరైటీగా ప్రింట చేయించాను. సీఎస్‌కే అభిమాని, గ్రాఫిక్ డిజైనర్ అయిన నా ఫ్రెండ్ సాయంతో ఈ పత్రికను డిజైన్ చేయించాను అని వినోద్ చెప్పాడు.

ఈ పత్రికను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీయే తమ ట్విటర్‌లో పోస్ట్ చేయడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఎన్నో వీడియోల్లో వినోద్ ఉన్నాడు. అతనికి ధోనీ తాను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను బహుమతిగా కూడా ఇచ్చాడు.

'2015వ సంవత్సరం అనుకోకుండా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నా పేరును అనౌన్స్ చేసేసరికి ఆశ్చర్యానికి లోనైయ్యాను. చెన్నై సొంతగడ్డపై జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇది జరిగింది. ఆ తర్వాత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేతుల మీదుగా బ్యాట్ కూడా అందుకున్నాను.' అని పేర్కొన్నాడు.

Have a great day!
Read more...

English Summary

Chennai Super Kings are known for their loyal support base but one fan - K Vinod - took his love for the team to another level as he got his wedding invite printed as match ticket of a CSK home game.