కారణం ఇదీ: రెండు బ్యాచ్‌లుగా దుబాయికి వెళ్లనున్న టీమిండియా


హైదరాబాద్: సెప్టెంబర్ 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. భారత్ మినహా టోర్నీలో పాల్గొనే మిగతా జట్లు అన్నీ ఇప్పటికే దుబాయికి చేరుకున్నాయి.

Advertisement

స్వల్ప మార్పు: టీమిండియా బస చేసేది అబుదాబి కాదు... దుబాయిలో

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో భారత జట్టు ఇంకా దుబాయికి చేరుకోలేదు. మంగళవారంతో ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటన ముగిసింది. దీంతో కోహ్లీసేన గురువారం లేదా శుక్రవారం భారత్‌‌లో అడుగుపెట్టనుంది. దీంతో ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టు సభ్యులు రెండు విడతలుగా దుబాయికి వెళ్లనున్నారు.

Explore Now: Cricket World Cup Action LIVE!
Advertisement

గురువారం దుబాయికి బయల్దేరనున్న టీమిండియా

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో లేని రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోని, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లు గురువారం దుబాయి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి తిరిగొచ్చే ధావన్‌, పాండ్యా, బుమ్రా, రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు ఆదివారం దుబాయ్‌ వెళ్లనున్నారు.

గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో టీమిండియాకు బస్

దుబాయ్‌లోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో వీరి కోసం బీసీసీఐ అధికారులు తాజాగా రూమ్‌లు బుక్‌ చేశారు. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా తన మొదటి రెండు మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. దీంతో ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
19న పాక్‌తో తలపడనున్న భారత్

ఆసియా కప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, హాంకాంగ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు పాల్గొంటున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉండటం విశేషం. టోర్నీలో భాగంగా భారత్‌ తన తొలి మ్యాచ్‌ను 18న హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ మరుసటి రోజు 19న దాయాది దేశమైన పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

Advertisement
కెప్టెన్‌గా రోహిత్ శర్మ

వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌‌లను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

English Summary

Team India will depart for the upcoming Asia Cup 2018 in the United Arab Emirates (UAE) in two batches – one on September 13 and another on September 16.