కెప్టెన్ కోహ్లీకి సలహాలిస్తోన్న మాజీ కెప్టెన్ గంగూలీ


హైదరాబాద్: భారత జట్టులో స్థానం కల్పించి టీమిండియాకు మంచి క్రికెటర్లను అందించిన భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోహ్లీకి సూచనలిస్తున్నాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని భారత జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సలహా ఇచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో ఓడిపోయింది. సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఎంపికపై పలువురు మాజీలు కోహ్లీపై విమర్శలు గుప్పించారు. వారితో పాటుగా గంగూలీ కూడా చేరాడు.

కెప్టెన్‌ కోహ్లీ వెనకేసుకురావాలి

తాజాగా గంగూలీ సిరీస్‌ ఓటమి, జట్టు ఎంపిక గురించి మాట్లాడాడు. ‘ఎవరైనా ఆటగాడు ఒక మ్యాచ్‌లో సరిగా ఆడకపోతే వారిని కెప్టెన్‌ కోహ్లీ వెనకేసుకురావాలి. వారితో మాట్లాడి ఆ ఆటగాడిలో ఆత్మస్థైర్యం నింపాలి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. క్రికెట్‌లో ప్రతిభ ఉన్న ఆటగాడిని గుర్తించడమే సవాలుతో కూడుకున్నది. అలాంటి ఆటగాళ్లను గుర్తిస్తేనే జట్టును విజయవంతంగా నడిపించగలం'

ఆటగాళ్లలోని ప్రతిభను కోహ్లీ బయటకు తీయాలి:

'మన జట్టులో అలాంటి ఆటగాళ్లు ఉన్నారు. పుజారా, రహానె, రాహుల్‌ ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. వాళ్లలోని ప్రతిభను కోహ్లీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా ఇది కోహ్లీ బాధ్యత. కోహ్లీ సహచర ఆటగాళ్ల భుజాలపై చేతులేసి జట్టు విజయాల గురించి వారితో మాట్లాడాలి. జట్టులో ఇలాంటి వాతావరణం ఎంతైనా అవసరం'

రాహుల్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ గడ్డలపై సెంచరీలు:

‘అలాగే సెలక్లర్లు కూడా విదేశీ గడ్డలపై ఎవరు ఎక్కువ పరుగులు చేస్తున్నారో గమనించాలి. అలాంటి వారికి భారత్‌లో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారు మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌నే చూడండి. అతడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ గడ్డలపై సెంచరీలు సాధించాడు. కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఆటగాడిపై ఒత్తిడి ఉండటం సహజమే.'

వీలైనంత ఎక్కువ సమయం వారు క్రీజులో ఉంటే:

'ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఆటగాడు ఒత్తిడిని అధిగమిస్తాడు. సెలక్టర్లు వీటిని బ్యాలెన్స్‌ చేసుకుని జట్టును ఎంపిక చేయాలి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఓటమి గురించి ఏ ఒక్కర్ని వ్యక్తిగతంగా కారణం చేయడం సరికాదు. విదేశీ గడ్డలపై ఓపెనర్లు పరుగులు చేయాలి. వీలైనంత ఎక్కువ సమయం వారు క్రీజులో ఉంటే బంతి పాతబడుతోంది. దీంతో మిడిలార్డర్‌ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Have a great day!
Read more...

English Summary

Ganguly, who was always known to present strong cases in favour of players he believed in, wants Kohli to give the players the confidence to accept challenges and win matches.